News
లాలూ ప్రసాద్ యాదవ్ కుట్ర ఇదే
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంతోపాటు మరో 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదు చేసింది. రాంచీ, పూరీలలోని రెండు రైల్వే హోటళ్ళ నిర్వహణ బాధ్యతను వినయ్ కొచ్చార్, విజయ్ కొచ్చార్‌ల యాజమాన్యంలోని సుజాత హోటల్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. దీనికి ప్రతిఫలంగా డిలైట్ అనే ఓ బినామీ కంపెనీ ద్వారా 3 ఎకరాల భూమి రూపంలో లంచం తీసుకున్నారని పేర్కొంది. ఈ కేసులో ఇతర నిందితుల్లో లాలూ సతీమణి రబ్రీదేవి, ఆయన కుమారుడ తేజస్వి, ఐఆర్‌సీటీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పీ.కే. గోయల్, లాలూ సహచరుడు ప్రేమ్ చంద్ గుప్తా సతీమణి సరళ గుప్తా ఉన్నారు. ప్రేమ్ చంద్ గుప్తా కూడా గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








